top of page
Suresh D

లోక్‌సభ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు..!🗳️✨

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడొకరు సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా (45) లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు.

12వ తరగతి డ్రాప్‌ఔట్‌ అయిన సరబ్జిత్ సింగ్ ఖల్సా దివంగత ప్రధానిని చంపిన ఇద్దరు హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు. కాగా బియాంత్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ బియాంత్ సింగ్ పలు మార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2009లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో భటిండా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయనకు లక్షా 13,490 ఓట్లు పొందాడు. ఆ తర్వాత వచ్చిన 2014లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఫతేఘర్ సాహిబ్ (రిజర్వ్‌డ్) స్థానం నుంచి పోటీ చేసి అప్పుడూ ఓటమి పాలయ్యాడు. ఇక 2019లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు.

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు 3.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఇక సరబ్‌జీత్‌ తల్లి బిమల్‌ కౌర్‌ ఖల్సా 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రోపర్‌ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అదే ఎన్నికల్లో ఆయన తాత సుచాసింగ్‌ కూడా బఠిండా నుంచే పోటీ చేసి ఎంపీగా విజయం దక్కించుకున్నాడు.ప్రస్తుతం సరబ్‌జీత్‌ పోటీ చేస్తున్న ఫరీద్‌కోట్‌లో కాంగ్రెస్‌ ఎంపీ మహమ్మద్‌ సాదిఖ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున సిట్టింగ్‌ ఎంపీ, సినీ నేపథ్య గాయకుడు హన్స్‌రాజ్‌ హన్స్‌ పోటీ చేస్తున్నాడు. ఆమ్‌ఆద్మీ పార్టీ తరపున ప్రముఖ కమెడియన్‌ కరంజీత్‌ అనుమోల్‌ను పోటీ చేస్తున్నాడు. శిరోమణి అకాలీదళ్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఫరీద్‌కోట్‌లో తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్ ఆమె నివాసంలో తుపాకులతో కాల్చడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.🗳️

bottom of page