top of page
MediaFx

భారీ వర్షాలను సైతం లెక్కచేయని సోనూసూద్..తడుస్తూనే ప్రజలకు సాయం..


ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు. ఈ మాటను అక్షరాల ఆచరణలో పెడుతున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలు, దినసరి కూలీలకు ఆయన అందించిన సాయం ఎప్పటికీ మరవలేనిది. ఆ తర్వాత కూడా అడిగిన వారందరికీ ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడీ రియల్ హీరో. గతంలో వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా గడిపేసే సోనూసూద్ ఇప్పుడు తన సమయాన్ని మొత్తం ప్రజలకే కేటాయిస్తున్నాడు. సాయం కోరి తన దగ్గరకు వచ్చే వారి కష్టాలు విని ఆపన్నహస్తం అందించేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాయం కోసం రోజూ వందలాది మంది సోనూ సూద్ ఇంటికి వెళుతున్నారు. ఇదిలా ఉంటె గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై నగరం కూడా తడిసి ముద్దవుతోంది. దీంతో జనాలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు అడుగుపెట్టడం లేదు. కానీ సోనూసూద్ మాత్రం అలా చేయలేదు. భారీ వర్షంలోనూ సాయం కోసం తన ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్లను కలిశారీ రియల్ హీరో.

bottom of page