top of page
MediaFx

బాలీవుడ్‌ని ఏలేస్తూన్న సౌత్‌ బ్యూటీస్ - రష్మిక నుండి సాయిపల్లవి వరకు!

నార్త్ సినిమాలకు బిజినెస్‌ గట్టిగా జరగాలంటే సౌత్‌ టచ్‌ ఉండాల్సిందేనని నమ్ముతున్నారు మేకర్స్. హీరోలు, లేకుంటే విలన్లుగా మనవారిని అప్రోచ్‌ అవుతున్నారు. సౌత్‌ నుంచి గ్లామర్‌ టచ్‌ కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్‌లో అవకాశాలు కొల్లగొట్టేస్తున్న మన హీరోయిన్లు ఎవరు? చూద్దాం..నేషనల్‌ క్రష్‌ రష్మికకు నేషనల్‌ పర్మిట్‌ ఎప్పుడో వచ్చేసింది. "యానిమల్" చిత్రంలో సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం పట్ల సక్సెస్‌ సాధించిన తర్వాత రష్మిక క్రేజ్‌ ఎక్కడికో చేరింది. ఇప్పుడు సల్మాన్‌తో "సికిందర్" మరియు విక్కీ కౌశల్‌తో "చావా" సినిమాలలో నటిస్తున్నారు.

నార్త్‌లో పూజా హెగ్డేకి పెద్ద హిట్‌ లేకపోయినా, సౌత్‌లో ఉన్న క్రేజ్‌ వలన అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఆమె సౌత్‌లో ఉన్న పేరును ఉపయోగించుకుంటున్నారు.

సౌత్‌లో పక్కింటమ్మాయిగా రౌడీ బేబీ ఇమేజ్‌ ని సొంతం చేసుకున్న సాయపల్లవి, నార్త్ ఇండస్ట్రీలో రెండు పెద్ద ప్రాజెక్టులతో అడుగుపెడుతున్నారు. "రామాయణం" మరియు అమీర్‌ ఖాన్‌ కొడుకుతో మరో సినిమా. ఈ రెండు సినిమాలు క్రేజీ ప్రాజెక్టులు.

సాయిపల్లవినే ఫాలో అవుతున్నారు కీర్తి సురేష్. అట్లీ భార్య ప్రియ ప్రొడ్యూస్‌ చేస్తున్న "బేబీ జాన్‌" సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీతో నార్త్ లో కీర్తి పేరు నిలుస్తుందని అంటున్నారు.

సౌత్‌లో అనతికాలంలోనే వండర్‌ఫుల్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల, త్వరలోనే నార్త్ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు.



bottom of page