యువ నటుడు శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'సామజవరగమన'. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. తొలిరోజు ఓపెనింగ్స్ తక్కువగానే ఉన్నప్పటికి.. రెండో రోజు నుంచి భారీ వసూళ్లుతో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ అడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.2.89 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.3.42 కోట్ల కలెక్షన్లు రాబట్టి టాక్ ఆప్ ద టౌన్ గా నిలుస్తోంది. ఇక మూడో రోజు అయితే ఏకంగా రూ. 6.65 కోట్లు వసూలు చేసింది. ఇదే విధంగా నాలుగో రోజు కూడా రూ. 3 కోట్లు రాబట్టింది. అయితే ఐదో రోజు కూడా ఊహించని రేంజ్ లో కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రూ.1.20 కోట్ల, వరల్డ్ వైడ్ గా రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లుతో దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదే సినిమాతో రిలీజైన 'స్పై' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఏడో తారీఖు దాకా మరే సినిమాలు లేకపోవడంతో 'సామజవరగమన' కలెక్షన్లతో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా కాలంగా హీరో శ్రీవిష్ణు కు సరైన హిట్ లేదు. ఈ మూవీ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా జూన్ 29న రిలీజ్ అయింది. ఈ మూవీలో శ్రీవిష్ణు సరసన రెబ్బామోనిక జాన్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో నరేశ్, వెన్నెల కిశోర్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజేష్ దండా నిర్మించారు.