టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కాని.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చింతంగా చెప్పవచ్చు.
ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన సంగతి అందరికి తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. రష్మికపై వచ్చిన ఆశ్లీల వీడియోను సినీ , రాజకీయ ప్రముఖులు ఖండించారు. అయిన కూడా ఇలాంటి ఆగడాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో భారీన పడ్డారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ మార్క్ రమ్‌ను కావ్య మారన్ హగ్ చేసుకుని లిప్ టూ లిప్ కిస్ పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన కావ్య మారన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన టీమ్ ఓనర్‌పై ఇలాంటి చెత్త వీడియోలు పోస్ట్ చేస్తే ఊరుకోమంటూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు. సెలబ్రిటీలనే ఇలా చేసిన వారు సామాన్యులను వదులుతారా అని భయపడిపోతున్నారు. అయితే ఈ డీప్ ఫేక్ వీడియోపై కావ్య మారన్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ వీడియోపై కావ్య మారన్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఎంకరేజ్ చేస్తుంటారామె. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటాయి. హైదరాబాద్ టీం గెలిచినా, ఓడినా కావ్య పాప ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అన్ని ఇన్ని కావు. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంను ఇష్టపడే వారు ఉన్నారో లేదో కాని.. కావ్య మారన్‌ని ఇష్టపడని వారుండరు. కావ్య మారన్ కోసమే సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు చూసే వారి కూడా ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.