హన్వాడ మండలం గొండ్యాల గ్రామానికి చెందిన రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి కావలి ఆంజనేయులు, బీజేపీ మైనారిటీ సెల్ మండల యువత అధ్యక్షుడు ఉస్మాన్, బిజెపి వ్యవసాయ విభాగం మండల అధ్యక్షుడు, ఆదర్శ రైతు పాల ఆంజనేయులు సహా గ్రామానికి 50 మంది వివిధ పార్టీల నుంచి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు.
హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ అచ్చిరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కుమారుడు సుదర్శన్ రెడ్డి, నర్సయ్య, సహ సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాటిలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు.అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్లు నూతనంగా పార్టీలోకి వచ్చిన వారు తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, జిల్లా రైతుబంధు సమితి డైరెక్టర్ లక్ష్మయ్య, పార్టీ సీనియర్ నాయకులు రమణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.