top of page
Suresh D

అయోధ్య రామ మందిరంపై తెలుగు వెబ్ సిరీస్..🎥✨

శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య రామజన్మభూమి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలిసారిగా జరుగుతున్న వేడుకలు కావడంతో దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రామ అయోధ్య అనే ఒక సరికొత్త వెబ్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకురానుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్యలో ఈ డాక్యుమెంటరీ సిరీస్ ను చిత్రీకరించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత సత్యకాశీ భార్గవ రామ అయోధ్య సిరీస్ కు స్టోరీ అందించ‌గా.. కృష్ణ దర్శకత్వం వహించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 17న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా.🎥✨


bottom of page