top of page
MediaFx

తారల వంటి కళ్ళతో అదరహో అనిపిస్తున్న దిశా..


13 జూన్ 1992న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో హిందూ రాజపుత్ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ దిశా పటాని.ఈ ముద్దుగుమ్మ తండ్రి జగదీష్ సింగ్ పటానీ పోలీసు అధికారిగా పని చేస్తున్నారు. తల్లి పద్మ పటాని హెల్త్ ఇన్‌స్పెక్టర్.

ఈ వయ్యారి అక్క ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్. ఆమెకి సూర్యాంశ్ పటానీ అనే తమ్ముడు కూడా ఉన్నాడు.లక్నోలోని అమిటీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో సినిమా అవకాశం రావడంతో మధ్యలోనే వదిలేసింది.

2013లో ఇండోర్ వేదికగా జరిగిన పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా వేడుకలో మొదటి రన్నరప్‌గా నిలిచింది ఈ వయ్యారి. 2015లో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన తెలుగు యాక్షన్ డ్రామా సినిమా లోఫర్ తో చలనచిత్ర అరంగేట్రం ఈ వయ్యారి భామ.

2016లో సుశాంత్ సింగ్ హీరోగా ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీలో ఓ కీలక పాత్రలో నటించింది ఈ అందాల తార. ఇటీవల తెలుగు ఇండియన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి 2898 ఏడిలో ప్రభాస్ పక్కన ఆకట్టుకుంది. 

ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న కంగువ అనే ఓ తమిళ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుంది ఈ బ్యూటీ.  దీంతో పాటు వెల్కమ్ టు ది జంగిల్ అనే ఓ హిందీ సినిమా కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

bottom of page