top of page

వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?🌞🔥

MediaFx

ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. జనాలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. అయినప్పటికీ పనుల నిమిత్తం బయటకు రావాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. కానీ కొన్ని ఆహారాలు తింటే వేసవి తాపం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ కింది 5 ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి తింటే వేసవిలో చెమట పెరిగి, మరింత అసౌకర్యంగా ఉంటుంది.

కాఫీ

చాలామందికి కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభం కాదు. అయితే ఈ వేడిలో కాఫీని ముట్టుకోకపోవడమే మంచిది. కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది అడ్రినల్ గ్రంథులను మరింత చురుకుగా చేస్తుంది. దీని కారణంగా అరచేతులు, పాదాలు, అండర్ ఆర్మ్స్‌లో చెమట మరింత పెరుగుతుంది. చెమటను తగ్గించుకోవడానికి కాఫీకి దూరంగా ఉండాలి.

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్‌ తిన్నాక నుదుటిపై విపరీతంగా చెమట పడుతుంది. వేసవిలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. పచ్చి మిరపకాయలు, ఎండు మిరపకాయలులతో తయారు చేసిన వంట తినడం మానుకోవాలి. అవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వేడి వాతావరణంలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది.

చక్కెర ఆహారాలు

తీపి, శీతల పానీయాలు తాగినా ఎక్కువగా చెమట పడుతుంది. పైగా ఇన్సులిన్ హార్మోన్ పనితీరు కూడా చెదిరిపోతుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అందుకే వేసవిలో చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఆల్కహాల్

బీర్ తాగడం వల్ల వేడిలో ఉపశమనం కలుగుతుందని చాలా మంది అనుకుంటారు. ఈ ఆలోచన పూర్తిగా తప్పు. వేడిలో మద్యం తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట కూడా అధికంగా పడుతుంది. అందుకే వేసవిలో మద్యం సేవించడం మానుకోవాలి.

సోడా

శీతల సోడా పానీయాలు వేసవిలో తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి. అయితే సోడాల్లో చక్కెర చాలా అధికంగా ఉంటుంది. దాహం వేసినప్పుడు సోడా తాగడం ప్రమాదకరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచవచ్చు. పైగా చెమట కూడా పెరుగుతుంది. సోడా డ్రింక్స్‌కు బదులుగా ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.


 
bottom of page