top of page
Shiva YT

🇮🇳 విజయవంతంగా ముగిసిన G20 సమ్మిట్..

🌐 భారతదేశం నిర్వహించిన G20 సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. 🤝 దాదాపు 20 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సుని భారీ ఎత్తున నిర్వహించింది. 🌍 భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, కళలను తెలియజెప్పే విధంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో కొన్ని చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి.

🏛️ భారత మండపంలోని సమావేశ మందిరం ప్రవేశం వద్ద 28 అడుగుల ఎత్తైన నటరాజ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 🕺 ఈ విగ్రహాన్ని స్థాపించడం వెనుక మతపరమైన కారణంతో పాటు చారిత్రక దృక్పదం కూడా ఉంది. 📚 ఈ నటరాజ విగ్రహం శివుని నృత్య భంగిమను వర్ణిస్తుంది. 💃 ఇందులో శివుడు నటరాజ స్వామిగా రాక్షసుడిని తన ఒంటికాలితో నొక్కుతూ భూమిలోకి అదిమి పెడుతున్నాడు. 🌟 అటువంటి పరిస్థితిలో శివుని నటరాజ రూపం.. నృత్యం ద్వారా చెడును తొలగించి సానుకూల శక్తిని ప్రసారం చేస్తాడనే సందేశాన్ని ఇస్తుంది. 🌈 🏫 నలంద విశ్వవిద్యాలయం 5వ శతాబ్దంనుంచి 12వ శతాబ్దం మధ్య ఉండేది. ఇది మహావీరుడు.. బుద్ధుని కాలం నాటిదిగా పరిగణించబడుతుంది. ఈ విశ్వవిద్యాలయం ప్రాచీన భారతదేశ జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. 📜 ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచంలోని పురాతన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలంద విశ్వవిద్యాలయం భారతదేశం అధునాతన.. విద్యా పరిశోధనలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు. 🎓

bottom of page