అమీర్ ఖాన్ హీరోగా చేసిన దంగల్ సినిమా ఎంతటి విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో అమీర్ ఖాన్ రెండో కూతురుగా నటించిన సుహాని మృతి చెందడంతో బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది.. 🎬
బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ సెన్సేషనల్ చిత్రం ‘దంగల్’లో చిన్నారి బబితా ఫోగట్ పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ తాజాగా కన్ను మూశారు. 🌟
అమీర్ ఖాన్ కెరియర్ లోనే దంగల్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ చిత్రంలో అమీర్ ఖాన్ చిన్న కూతురుగా నటించిన సుహాని కేవలం 19 సంవత్సరాలకే ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లిపోయింది. సుహాని గత కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఆ అనారోగ్యం కారణంగా ఈరోజు అంటే ఫిబ్రవరి 17, 2024న మరణించారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 📽️
బబితా ఫోగట్ అనే పాత్రలో దంగల్ సినిమాలో నటించి సుహానీ భట్నాగర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో ఎంతో చూడ చక్కగా కనిపిస్తుంది ఈ అమ్మాయి. అయితే అలాంటి తను 19 ఏళ్లకే కన్నుమూసిందంటే అభిమానులు నమ్మలేకపోతున్నారు. 🌠
ఆమె మృత్తికి గల పూర్తి కారణం ఇంకా అధికారికంగా వెల్లదించకపోయిన ..తాజా సమాచారం మేరకు సుహాని మరణానికి కారణం తన శరీరం మొత్తం నీరు పట్టడం అని అంటున్నారు. కొంత కాలం క్రితం సుహానీకి యాక్సిడెంట్ అవ్వగా ఆ సమయంలో అతని కాలు ఫ్రాక్చర్ అయింది. అదే సమయంలో, అందుకోసం ఆమె తీసుకున్న మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని తెలుస్తోంది. ఆమె డిజైన్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఆమె శరీరంలో నీరు పేరుకుపోవడం మొదలైందని ఇంకా ఆ కారణంగానే సుహాని చాలా కాలం నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అలా చికిత్స పొందుతూ ఆమె ఈరోజు మరణించింది. కాగా ఈ రోజు సుహాని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
సుహాని 2016లో అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’ లో బబితా ఫోగట్ పాత్రను పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ సినిమాలోనే కాకుండా కొన్ని హిందీ టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించింది. కాగా దంగల్ సినిమా తరువాత ఈ అమ్మాయి ఎలాంటి చిత్రాలు ఒప్పుకోలేదు.. తన చదువు పూర్తి చేసిన తర్వాత, తాను తిరిగి సినిమా పరిశ్రమకు రావాలని అనుకున్నట్లు పలుమార్లు సుహాని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.🎭🎥