top of page
Suresh D

ఊరు పేరు భైరవకోన రివ్యూ.. సందీప్ కిషన్‌కు హిట్..?✨🎞️

సందీప్ కిషన్ హీరోగా నటించిన మరో సినిమా ఊరు పేరు భైరవకోన. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను వాలంటైన్స్ డే స్పెషల్‌గా రెండు రోజుల ముందే ప్రీమియర్ షోస్ వేశారు. మరి అవి చూసిన ప్రేక్షకులు ఊరు పేరు భైరవకోన రివ్యూలో ఏం చెప్పారో చూద్దాం.✨🎞️

హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీనే ఊరు పేరు భైరవకోన. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఊరు పేరు భైరవకోన సినిమాకు ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమాలోని మొదటి రెండు పాటలు నిజమే నే చెబుతున్నా, హమ్మా హమ్మా చార్ట్‌బస్టర్‌ హిట్స్‌ అయ్యాయి. 

ఇక ఊరు పేరు భైరవకోన మూవీ టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. అయితే, ఊరు పేరు భైరవకోన మూవీ ఫిబ్రవరి 16న విడుదల కానుంది. కానీ, వాలంటైన్స్ డే స్పెషల్‌గా రెండు రోజుల ముందే ఊరు పేరు భైరవకోన ప్రీమియర్ షోలను చాలా ఏరియాల్లో వేశారు. ఈ ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా హిట్ అంటూ నెటిజన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. అయితే మరికొన్ని చోట్ల మాత్రం మూవీకి మిక్స్‌డ్ టాక్ వస్తోంది.

కొందరేమో ఊరు పేరు భైరవకోన సినిమా బాగుందని అంటే.. మరికొందరు యావరేజ్ అని చెబుతున్నారు. మరి కొందరు పర్లేదు, డీసెంట్ మూవీ అని వివిధ రకాలుగా ఊరు పేరు భైరవకోన మూవీపై కామెంట్స్ చేస్తున్నారు. ఇలా సినిమాపై నెట్టింట్లో పలు విధాలుగా చర్చ నుడుస్తోంది. ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేస్తున్నారు.

"జస్ట్ ఇప్పుడే ఊరు పేరు భైరవ కోన మూవీ చూశాను. సందీప్ కిషన్ అన్నకి హిట్ పడింది. సెకండాఫ్ ఎక్సలెంట్" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. "ఇంటర్వెల్ మాత్రం బాగుంది. బ్యాగ్ పోయింది. భైరవకోనకు ఎంట్రీ దొరికింది. ఇంటర్వెల్, గ్రాఫిక్ సీన్స్ పర్వాలేదు" అని మరో వ్యక్తి ట్విటర్ వేదికగా చెప్పాడు. సూపర్ మూవీ అని మరొకరు రాసుకొచ్చారు.

"సాంగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అంతే ఇంకేం లేదు లోపల" అని టీకే అనే నెటిజన్ ఊరుపేరు భైరవకోన మూవీపై తన అభిప్రాయం చెప్పాడు. "ఫస్టాఫ్ చాలా యావరేజ్‌గా ఉంది. మిస్టరీ థింగ్స్ ఉంటాయి. కానీ, వాటికి ఆడియెన్స్ వంద శాతం అస్సలు కనెక్ట్ కారు. చాలా క్యాజువల్ కామెడీ. మంచి ట్విస్టుతో ఇంటర్వెల్ ఉంటుంది. సెకండాఫ్ చాలా బెటర్‌గా ఉంటే మూవీ హిట్ అయినట్లే" అని ఒకరు చెప్పారు.

ఇలా ఊరు పేరు భైరవకోన సినిమాకు ఢిఫరెంట్ టాక్ వస్తోంది. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిపోయిందని అంటున్నారు. సెకండాఫ్ కూడా బాగుందని కొందరు అంటున్నారు. విజువల్స్ చాలా బాగున్నాయని, పాటలు వినడానికి, చూడటానికి చక్కగా ఉన్నాయట. ఇక బీజీఎమ్ కూడా అదిరిపోయేలానే ఉందని చెబుతున్నారు. ఫాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఊరు పేరు భైరవకోన మూవీతో సందీప్ కిషన్‌కు హిట్ పడినట్లే అంటున్నారు.✨🎞️

bottom of page