top of page
MediaFx

సన్నీ లియోన్ డ్యాన్స్ షోకు అనుమతి నిరాకరణ.. ఎందుకో తెలుసా?

బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు కేరళలో షాక్ తగిలింది. తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ క్యాంపస్‌లో జూలై 5న ఏర్పాటు చేసిన డ్యాన్స్ షోకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్ అనుమతి నిరాకరించారు.

ప్రోగ్రామ్ లిస్ట్‌లో ఆమె డ్యాన్స్ షోను చేర్చొద్దని ఆదేశాలు జారీ చేశారు. క్యాంపస్ లోపల లేదా వెలుపల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి యూనియన్‌ను అనుమతించబోమని తెలిపారు. కళాశాల యూనియన్ కూడా విశ్వవిద్యాలయ అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందడంలో విఫలమైంది.

గతేడాది నవంబర్‌లో కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్)లో జరిగిన సంగీత కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు, మరెన్నో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కాలేజీ క్యాంపస్‌లలో ఎక్స్‌టర్నల్ డీజే పార్టీలు, మ్యూజిక్ నైట్‌లపై నిషేధం విధించింది.

43 ఏళ్ల సన్నీ లియోన్ బాలీవుడ్‌లో ‘జిస్మ్ 2’, ‘జాక్‌పాట్’, ‘షూటౌట్ ఎట్ వడాలా’, ‘ రాగిణి ఎంఎంఎస్ 2’ వంటి చిత్రాలలో నటించారు. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె, ముహూర్తం పూజ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సినిమాకు ఇంకా పేరును ఖరారు చేయలేదు.

bottom of page