top of page
Shiva YT

🎬 ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..

🎥 ఈ సినిమాలో సీనియర్ హీరో శరత్ కుమార్, అమితాశ్ ప్రధాన్ ప్రధాన పాత్రలలో నటించగా.. అరవింద్ రాజ్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమా కశ్మీరా పరదేశి కథానాయికగా నటించింది.

బాలాజీ శక్తివేల్, టి.శివ విన్సెంట్ అశోఖన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందంచారు. గతేడాది సెప్టెంబర్ 1న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు రూ. 6 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 15 కోట్లు రాబట్టింది. కథ, కథనం స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

📆 ఫిబ్రవరి 1నుంచి ఈ మూవీ తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఓటీటీలో అత్యధిక రెస్పాన్స్ అందుకున్న సినిమాల్లో పరంపోరుల్ ఒకటి. పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ మూవీ కథ తిరుగుతుంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ విగ్రహం మెయిన్ స్టోరీనే ఈ పరంపోరుల్ అన్నట్లుగా తెలుస్తోంది. మరీ థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ఓటీటీలో చూసేయ్యండి.


bottom of page