top of page
MediaFx

సూపర్ డూపర్ హిట్ మలయాళం మూవీ సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్..🎬


మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు సినిమా ఈ ఏడాది ఏకంగా రూ.135 కోట్లకుపైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులోనూ రూ.15 కోట్లకుపైగా వచ్చాయి. దీంతో మూవీ సీక్వెల్ తీయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రేమలు 2 పేరుతో ఈ సినిమా రానుంది. ఎక్స్ ద్వారా మూవీ సీక్వెల్, టైటిల్ ను రివీల్ చేశారు. "మలయాళం సినిమాలో గతంలో ఎన్నడూ లేని అతిపెద్ద రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ 2025లో మళ్లీ వస్తోంది. ప్రేమలు 2 చేసుకుందాం" అనే క్యాప్షన్ తో ఈ సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. మలయాళంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సీక్వెల్ కు కూడా గిరీష్ ఏడీ దర్శకత్వం వహించనున్నాడు. తమ క్యూట్ లవ్ స్టోరీతో మరోసారి అలరించడానికి నస్లెన్, మమితా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రేమలు మూవీని హీరో సచిన్ యూకే వెళ్తున్న సీన్ తో ముగించారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దామని చెప్పి అతనికి నుదిటిపై ముద్దు పెట్టి వెళ్లిపోతుంది హీరోయిన్ రీనూ రాయ్. దీంతో సీక్వెల్లో వీళ్ల లవ్ స్టోరీ ఎలా ముందుకు సాగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.


bottom of page