top of page
MediaFx

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు vs యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్: ద‌ర్శ‌కుల ఎంపికలో పోలికలు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఈ ఇద్ద‌రి శైలి ఇంచుమించు ఒకేలా క‌నిపిస్తోందని క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ద‌ర్శ‌కుల ఎంపిక‌లో ఒక‌రినొక‌రు పోలి ఉన్నారు. ఫ్రెండ్ కోసం ఒక‌టి.. పాన్ ఇండియా కోసం మ‌రొక‌టి ప్లాన్ చేసారు! అంటూ గుస‌గుస వినిపిస్తోంది. తొలిగా త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ తో `గుంటూరు కారం` ప్లాన్ చేసిన మ‌హేష్ ఆ సినిమా సెట్స్ లో ఉండ‌గానే, రాజ‌మౌళి లాంటి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ని లైన్ లో పెట్టాడు. గుంటూరు కారం ఈ కాంబినేష‌న్ కి హ్యాట్రిక్ ప‌రాజ‌యంగా మిగిలింది. అయినా మ‌హేష్ సేఫ్ గేమ్ ఆడ‌గ‌లిగాడు. ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితో భారీ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసాడు మ‌హేష్. ఇది త‌న కెరీర్ లో గేమ్ ఛేంజ‌ర్ గా మారుతుంద‌ని మ‌హేష్ భావిస్తున్నాడు. మ‌హేష్ ఈ సినిమాతో ఇండియాలోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా మారే వీలుంది. గ‌త ప‌రాజ‌యాలు ప‌రాభ‌వాల‌ను ఇది తుడిచి పెట్టేస్తుంద‌ని కూడా న‌మ్ముతున్నాడు. ఇంత‌లోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా త‌న ఫ్రెండు కొర‌టాల‌తో `దేవ‌ర` లాంటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వెంట‌నే ప్ర‌శాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కోసం రెడీ అవుతున్నాడు. దేవ‌ర జ‌యాప‌జ‌యాల‌తో ఎలాంటి సంబంధం లేకుండా త‌న‌ను ప్ర‌శాంత్ నీల్ క్రేజీ స్టార్ గా నిల‌బెడతాడ‌ని తార‌క్ న‌మ్ముతున్నాడ‌ట‌. నిజానికి కేజీఎఫ్ డైరెక్ట‌ర్ తో త‌దుప‌రి చిత్రం తెలివైన ఎంపిక అని కూడా విశ్లేషిస్తున్నారు. మ‌హేష్, ఎన్టీఆర్ ఇద్ద‌రూ స్నేహితుల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూనే, త‌దుప‌రి సేఫ్ సైడ్ ప్లాన్ చేస్తున్నార‌నేది ఒక విశ్లేష‌ణ‌. ఎన్టీఆర్ - నీల్ సినిమా కోసం మైత్రి మూవీ మేక‌ర్స్ చాలా కాలంగా స‌న్నాహ‌కాల్లో ఉంది. ఆ వెయిటింగ్ ఫ‌లించి ప్రాజెక్ట్ ఇప్ప‌టికి సాధ్య‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు. స‌లార్ లాంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ తెర‌కెక్కించిన‌ ప్ర‌శాంత్ నీల్ తో సినిమా అంటే బ‌జ్ స్కైలో ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ప్ర‌భాస్ తో స‌లార్ 2 చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌క‌ ముందే ఎన్టీఆర్ తో నీల్ సెట్స్ కెళ‌తాడా? లేక స‌లార్ 2 పూర్తి చేసే క్ర‌మంలోనే ఈ సినిమాని ప్రారంభిస్తారా? అన్న‌దానిపై స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

bottom of page