top of page
Suresh D

సూపర్ స్టార్ రజినీకాంత్ 171 సినిమా కన్ఫామ్..🎥🎞️

తాజాగా లోకేష్ తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ తో అని ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తలైవర్ 171 అంటూ పో పోస్టర్ ను రిలీజ్ చేశారు. కళానిధి మారన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

జైలర్ సినిమా భారీ విజయం సాధించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 700 కోట్లకు పైగా వసూల్ చేసి మరోసారి సూపర్ స్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించింది. తెలుగు, తమిళ్ భాషల్లో మాత్రమే జైలర్ సినిమా రిలీజ్ అయింది. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ ఎవరితో సినిమా చేస్తున్నారు అన్నాడని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ నయా మూవీ అప్డేట్ వచ్చేసింది. రజినీకాంత్ తన నెక్స్ట్ సినిమా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో చేస్తున్నారు. విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన లోకేష్ ప్రస్తుతం దళపతి విజయ్ తో సినిమా చేస్తున్నారు.లియో అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. తాజాగా లోకేష్ తన నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ తో అని ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తలైవర్ 171 అంటూ పో పోస్టర్ ను రిలీజ్ చేశారు. కళానిధి మారన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.🎥🎞️


bottom of page