top of page
Suresh D

సూర్య వర్సెస్ సూర్య..🎥✨


కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సిరుత్తై శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం కంగువ . దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్.సూర్య యోధుడు గా కనిపించిన పాత్రతో పాటుగా, స్టైలిష్ గా చేతిలో గన్ పట్టుకొని ఉన్న మరో ఇంట్రెస్టింగ్ రోల్ గెటప్ ను రివీల్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ల సహకారంతో స్టూడియో గ్రీన్‌ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2024 లోనే రిలీజ్ కానున్నట్లు తెలిపారు మేకర్స్.🎥✨

bottom of page