top of page
MediaFx

సూర్య బర్త్ డే ట్రీట్ వేరేలెవల్..బీజీఎమ్ గూస్ బంప్స్..


డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సూర్య స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు విడుదలైన వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం యాటిట్యూడ్, మేనరిజం, స్వాగ్, కంటి చూపులతోనే చంపేశారు సూర్య. విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్రను మించిపోయిన రేంజ్ లో కనిచిపించారు. తన గ్యాంగ్ తో కలిసి సూర్య నడిచి వస్తుండగా.. వచ్చిన బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు హైలెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విడుదలైన సూర్య 44 గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా తమ హీరో సినిమాల కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. తాజాగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తుండగా.. ఇందులో జోజు జార్జ్, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.


bottom of page