🌟 సూర్య తప్పుకున్న ప్రాజెక్ట్..టీజర్‌కు రెస్పాన్స్ అదిరిపోయింది..?
- Shiva YT
- Feb 27, 2024
- 1 min read
🎬 నంద, శివపుత్రుడు సినిమాలతో సూపర్ హిట్స్ ఇచ్చిన సూర్య, బాలా కాంబోలో మరో మూవీ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఈ కాంబో రిపీట్ అవ్వబోతున్నట్టుగా ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. స్వయంగా సూర్య నిర్మాతగా బాల దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ అయ్యింది.
🎥 ఈ ప్రాజెక్ట్‌కు వనంగాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన మేకర్స్ కొంత షూటింగ్ కూడా చేశారు. సూర్య లుక్ రివీల్ చేస్తూ కొన్ని ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి. కానీ సడన్‌కు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు సూర్య. దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్సెసే అందుకు కారణం అన్న టాక్ వినిపించింది.
🎬 నిర్మాతగా కూడా సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోవటంతో పూర్తిగా కొత్త టీమ్‌తో ఈ సినిమాను రెడీ చేశారు దర్శకుడు బాలా. తాజాగా అరుణ్ విజయ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన వనంగాన్ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.
🌟 మరోసారి శివ పుత్రుడు తరహాలో హీరో క్యారెక్టరైజేషన్‌ను డిజైన్ చేశారు బాలా. మేకోవర్ నుంచి పెర్ఫామెన్స్ వరకు తనకు వచ్చిన అవకాశాన్ని అరుణ్ విజయ్ పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు. ఈ సినిమాతో హీరోగా, నటుడిగా అరుణ్ విజయ్ మరో మెట్టు ఎక్కటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్.
🎬 మరోవైపు వనంగాన్ టీజర్ చూసిన సూర్య ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సినిమా సూర్యకు పడితే మరో క్లాసిక్ అయ్యుండేది అంటున్నారు. అయితే వనంగాన్ మిస్ అయినా... ఎప్పటికైనా మరోసారి బాల డైరెక్షన్‌లో సూర్య సినిమా చేస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 🌟