top of page
MediaFx

పుష్ప 2: "సూసేకి" పాట 100 మిలియన్ల వ్యూస్ తో సెన్సేషన్


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం మాత్రమే కాకుండా, సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప ఇప్పటికే 100 మిలియన్లకి పైగా వ్యూస్ రాబట్టడం జరిగింది.ఇటీవల సెకండ్ సింగిల్ అయిన సూసేకి పాటను రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూ ట్యూబ్ లో 100 మిలియన్లకి పైగా వ్యూస్ రాగా, 1.67 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇది క్రేజీ రెస్పాన్స్ అని చెప్పాలి. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఫహాద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



bottom of page