top of page
MediaFx

ఒకేరోజు రెండు సెమీ ఫైనల్స్.. రీజన్ తెలిస్తే రియాక్షన్ మాములుగా ఉండదంతే..


నిన్నటి నుంచి ఐసీసీ పొట్టి ఫార్మాట్ 9వ ప్రపంచ కప్ ప్రారంభమైంది. దీనిలో 20 జట్లు మొదటిసారి ఆడుతున్నాయి. టోర్నమెంట్‌లో మొదటిసారిగా, జూన్ 27న రెండు సెమీ-ఫైనల్‌లు ఒకే రోజు జరుగుతాయి. ఒకదానికి రిజర్వ్ డే, మరొక మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడం విశేషం.

భారత కాలమానం ప్రకారం జూన్ 27న రెండు సెమీఫైనల్‌లు ఒకే రోజు జరుగుతాయి. కానీ, అమెరికన్, కరేబియన్ టైమింగ్ ప్రకారం, మొదటి సెమీ-ఫైనల్ జూన్ 26 రాత్రి 8 గంటలకు, రెండవ సెమీ-ఫైనల్ జూన్ 27 ఉదయం 10:30 గంటలకు జరుగుతుంది. రెండో సెమీ ఫైనల్ గయానాలో జూన్ 27న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్‌పై ప్రభావం పడితే, కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. 250 నిమిషాల అదనపు సమయం అంటే 4 గంటల 10 నిమిషాలు ఉంచారు. రిజర్వ్ డే లేకపోవడం వల్ల మ్యాచ్ జూన్ 28 వరకు ఉంటే, సెమీ-ఫైనల్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్‌కు చాలా తక్కువ సమయం లభిస్తుంది. ఫైనల్ జూన్ 29న జరగనుంది.

ఈ క్రమంలో గతంలోనూ ఇలాంటి వివాదం చోటు చేసుకుంది. 10 సెప్టెంబర్ 2023, ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ప్రత్యేక రిజర్వ్ డే ఉన్నందున మరుసటి రోజు మ్యాచ్ కొనసాగింది.

ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే, కొత్త వివాదం మొదలయ్యే అవకాశం ఉంది.


bottom of page