top of page
MediaFx

టీ20 వరల్డ్ కప్‌కు ఉగ్రవాద హెచ్చరికలు!🚨


అమెరికా, వెస్టిండీస్ వేదికగా మరో నెల రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు తాజాగా ఉగ్రవాదుల హెచ్చరికలు రావడం కలకలానికి దారి తీసింది. వెస్టీండిస్ బోర్డుకు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు అందాయి. దీంతో అప్రమత్తమైన బోర్డు భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసింది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఐస్లామిక్ స్టేట్ అనుకూల మీడియా నశీర్ పాకిస్థాన్ .. క్రీడా ఈవెంట్లపై దాడులకు తెగబడాలంటూ ప్రచారాలు ప్రారంభించింది. ఒకానొక వీడియోలో ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఐఎస్ ఖొరసాన్ విభాగాం.. వివిధ దేశాల్లోని తన మద్దతుదారులను యుద్ధరంగంలోకి తెగబడాలని కోరింది. కాగా, ఈ పరిణామంపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈఓ స్పందిస్తూ.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ‘‘వరల్డ్ కప్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతే మా తొలి ప్రాధాన్యత. ఇందుకు కోసం కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అదే 29న ఫైనల్స్ జరగనున్నాయి.


bottom of page