top of page
Suresh D

పాటలోనే ఫుల్ మీల్స్ పెట్టిన తమన్నా, రాశిఖన్నా..!🎥✨


సుందర్ సి హీరోగా తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మై4. ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన గత మూడు చిత్రాల్లో సిద్ధార్థ్, ఆర్య, త్రిష, అండ్రియా వంటి స్టార్లు నటించారు. అవన్నీ మంచి ఘనవిజయాలను సాధించాయి. హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. అన్నింటినీ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈనెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నారు. దీన్ని తెలుగులో ఏషియన్ ఫిలిమ్స్ విడుదల చేస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. అరణ్మై4 చిత్రాన్ని బాక్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కూడా నటించారు. వీరిద్దరికీ సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను కూడా రెండురోజుల క్రితమే విడుదల చేశారు.తాజాగా ఈ సినిమాలో త‌మ‌న్నా రాశీ ఖ‌న్నాపై చిత్రీక‌రించిన పంచుకో అంటూ సాగే తెలుగు వెర్ష‌న్ పాటకు సంబంధించిన వీడియో పాట ప్రోమోను విడుదల చేయగా లక్షల వీక్షణలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ పాట‌లో త‌మ‌న్నా రాశీ ఖ‌న్నా ఒక‌రికొక‌రు పోటీ ప‌డి అందాల ప్ర‌ద‌ర్శ‌నలో రెచ్చిపోయి నటించారు. ఈ పాటను చూసిన ప్రేక్షకులు స్టన్ అవుతున్నారు. ఒకటికి నాలుగుసార్లు పాటను చూస్తున్నారు.  

bottom of page