top of page
Suresh D

గుండెపోటుతో ప్రముఖ తమిళ నటుడు డైరెక్టర్‌ జి మారిముత్తు హఠన్మరణ .. 🎥🎞

శుక్రవారం ఉదయం స్టూడియోలో ఇందుకు సంబంధించి డబ్బింగ్ చేస్తున్న సమయంలో.. తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు జి.మరిముత్తు గుండె పోటుతో ఆకస్మిక మరణానికి గురయ్యారు. ఆయన ‘ఎథిర్ నీచల్’ పేరుతో ఒక టెలివిజన్ షో తీస్తున్నారు. శుక్రవారం ఉదయం స్టూడియోలో ఇందుకు సంబంధించి డబ్బింగ్ చేస్తున్న సమయంలో.. తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరిముత్తు చివరిగా రజనీకాంత్ జైలర్ సినిమాలో కనిపించారు. అంతకుముందు రెడ్ శాండల్ వుడ్ లోనూ నటించారు. మరి ముత్తు హఠాన్మరణం తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మరిముత్తుకి భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు అఖిలన్, ఐశ్వర్య ఉన్నారు. ఆసుపత్రి నుంచి ఆయన మృతదేహాన్ని విరుగంబాక్కమ్ లోని నివాసానికి తరలించనున్నారు. ప్రజల సందర్శనార్థం సాయంత్రం వరకు ఉంచి, అంత్యక్రియల కోసం స్వస్థలం థేనికి తరలిస్తారు. 🎥🎞


bottom of page