top of page
Suresh D

సెప్టెంబర్‌ అక్టోబర్ల మీద కానేసిన తమిళ సినిమాలు..?

ఓ వైపు పొలిటికల్‌ ఎంట్రీ, ఇంకో వైపు సినిమాలను కంప్లీట్‌ చేసేయాలన్న హడావిడిలో ఉన్నారు దళపతి. సెప్టెంబర్‌ 5న ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌... గోట్‌ని విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. సమ్మర్‌ సీజన్‌ కంప్లీట్‌ అయి, సెప్టెంబర్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్.

అయితే, విజయ్‌ గోట్‌కన్నా ముందే తమిళ ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అంటున్నారు కమల్‌హాసన్‌.ఇండియన్‌2ని ఆఫ్టర్‌ ఎలక్షన్స్... జూన్‌లో రిలీజ్‌ చేస్తామని అనౌన్స్ చేసింది లైకా సంస్థ.

అదే సంస్థ రజనీకాంత్‌తో నిర్మిస్తున్న సినిమా వేట్టయన్‌. జైలర్‌ సక్సెస్‌ మీదున్న రజనీ ఇమీడియేట్‌ ప్రాజెక్ట్ ఇది. టైటిల్‌ గ్లింప్స్ ఇప్పటికే మెప్పిస్తోంది. అక్టోబర్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది వేట్టయన్‌.

అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే సమ్మర్‌లోపే అజిత్‌ విడాముయర్చి షూటింగ్‌ పూర్తి కావాల్సింది. కానీ, మధ్యలో ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో షెడ్యూల్స్ డిలే అయ్యాయి. జరిగిన ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకున్నా, ఈ సెప్టెంబర్‌, అక్టోబర్లలోనే అజిత్‌ సినిమా ప్రేక్షకులను పలకరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఒకవేళ మిస్‌ అయితే క్రిస్మస్‌ సీజన్‌ని క్యాష్‌ చేసుకుంటారనే టాక్‌ కూడా ఉంది. అటు కంగువ కూడా ఈ ఏడాది రిలీజ్‌ కావడానికి రెడీ అవుతోంది. సో.. ఒకటికి నాలుగైదు ప్యాన్‌ ఇండియా అప్పీల్‌ ఉన్న సినిమాలతో 2024ని కలర్‌ఫుల్‌గా ప్రెజెంట్‌ చేయనుంది కోలీవుడ్‌.

bottom of page