top of page
MediaFx

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ

తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ). పార్టీ బలోపేతం కోసం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమావేశమై, ఈసారి ఎన్నికల్లో యువతను ప్రోత్సహిస్తామని చంద్రబాబు తెలిపారు. త్వరలో తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిని నియమిస్తామని కూడా తెలిపారు.

చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణాలను వివరించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని కోరారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీలో పరిణామాల కారణంగా తెలంగాణపై దృష్టి పెట్టలేకపోయానని, ఇకపై సమయం కేటాయిస్తానని తెలిపారు.

bottom of page