top of page
Suresh D

హనుమాన్ గొప్ప నిర్ణయం .. ప్రతి ఐదురూపాయలు రామమందిరంకి..🎥✨

సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నప్పటికీ హనుమాన్ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హనుమాన్ మూవీ మేకర్స్ ఆసక్తికర ప్రకటన చేశారు.

ఈ సంక్రాంతి టాలీవుడ్ ప్రేక్షకులను ఫుల్ కిక్ ఇవ్వనుంది .. ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం, వెంకటేష్ సైందవ్, నాగార్జున నా సామిరంగా సినిమాలతో పాటు తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు  ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సూపర్ హీరో బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది. హనుమంతుడి నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.

సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నప్పటికీ హనుమాన్ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హనుమాన్ మూవీ మేకర్స్ ఆసక్తికర ప్రకటన చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు.

హనుమాన్ సినిమా ఆడినన్న రోజులు ఆ సినిమా టికెట్స్ పై వచ్చే డబ్బులతో ప్రతి టికెట్ పై 5 రూపాయిలను రామ మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి నిన్న హనుమాన్ ప్రీ రిలీజ్ వేదిక పై తెలిపారు . అయోధ్య రామమందిరానికి హనుమాన్ చిత్రయూనిట్ చేస్తున్న సాయం అభినందనీయం అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హనుమాన్ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. గెటప్ శ్రీను, వినయ్‌ రాయ్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. జనవరి 12న హనుమాన్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.🎥✨

bottom of page