top of page
MediaFx

ఢిల్లీలో టీమిండియా సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన రోహిత్ శర్మ


టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో ఢిల్లీలో అడుగుపెట్టిన ఇండియన్ టీమ్ కు ఘన స్వాగతం లభించింది. అక్కడి ఐటీసీ మౌర్య హోటల్ ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. తన చిరకాల వాంఛ నెరవేరడంతో రోహిత్ ఎంతో ఆనందంగా కనిపించాడు. టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫుల్ హ్యాపీగా కనిపించాడు. ఫైనల్లో చివరి ఓవర్లో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన అతడు.. విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. టీమిండియా ఎయిర్ పోర్టు నుంచి ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన ఓ భారీ కేకును ప్లేయర్స్ కట్ చేశారు. ఆ కేకుపై వరల్డ్ కప్ ట్రోఫీని చాక్లెట్ తయారు చేసిన నమూనా ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. విరాట్ కోహ్లి కూడా చాలా హ్యాపీగా కనిపించాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీ అంతా విఫలమైనా.. ఫైనల్లో మాత్రం అతడు 76 రన్స్ తో రాణించిన విషయం తెలిసిందే. టీమిండియా ఘన స్వాగతం పలకడానికి ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఐటీసీ మౌర్య హోటల్ కు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. టీమిండియాలోని ప్రతి ప్లేయర్ వరల్డ్ కప్ ట్రోఫీని చూస్తూ మురిసిపోయారు. నిజానికి ఫ్లైట్ లోనే వీళ్ల హంగామా ప్రారంభమైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తూ ఇలా వరల్డ్ కప్ ట్రోఫీని అభిమానులకు చూపించాడు. టీమిండియా ప్రధాని మోదీని కలిసిన తర్వాత ముంబైలో సాయంత్రం 5 గంటలకు వాంఖెడే స్టేడియం దగ్గర విక్టరీ పరేడ్ చేయనుంది.

bottom of page