🏆 వన్డేల్లో టాప్‌లో ఉన్న పాకిస్థాన్‌ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. 🏏 ఇక ఐసీసీ వన్డే బౌలింగ్ లో నెంబర్ వన్ స్థానంలో సిరాజ్ చోటు దక్కించుకోగా.. T20 బ్యాటింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. 🏏 టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉండగా, టెస్టుల్లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. 🏏
🇮🇳 టీమిండియా మరో అద్భుతాన్ని సృష్టించింది. శుక్రవారం ఆస్ట్రేలియాపై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న భారత క్రికెట్ జట్టు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 🙌 అన్ని ఫార్మాట్స్‌లో నెంబర్ ర్యాంక్‌లో నిలిచి చరిత్ర తిరగరాసింది. 🌟 ఇప్పటికే టీ20, టెస్టుల్లో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా ఆస్ట్రేలియాతో విజయం తర్వాత వన్డేల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. 🥳 వన్డేల్లో టాప్‌లో ఉన్న పాకిస్థాన్‌ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది. 🥇 ఇక ఐసీసీ వన్డే బౌలింగ్ లో నెంబర్ వన్ స్థానంలో సిరాజ్ చోటు దక్కించుకోగా.. T20 బ్యాటింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. 🏏 టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజా ఉండగా, టెస్టుల్లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు. 🌟 అలాగే శుభ్‌మన్ గిల్ వన్డే బ్యాటింగ్‌లో రెండవ స్థానంలో ఉన్నాడు. 🏏 ఇదిలా ఉంటే ఇలా మూడు ఫార్మాట్స్‌లో టీమిండియా మొదటి స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. 🇮🇳 టీమిండియా కంటే ముందు 2012లో దక్షిణాఫ్రికా ఈ అరుదైన ఘనతను సాధించింది. 🏏 ప్రస్తుతం భారత్ ఈ లిస్ట్‌లో చేరడం విశేషం. 🥇