ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ కోసంతాజాగా టీమ్ ఇండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. అడిడాస్ స్పాన్సర్ చేసిన ఈ కొత్త జెర్సీలో నీలం, ఆరెంజ్ కలర్స్ కాంబినేషన్ లో రూపొందింది. అలాగే భారత జట్టు ట్రేడ్‌మార్క్ కలర్ అయిన బ్లూ జెర్సీ స్లీవ్‌లపై కాషాయం రంగును జోడించారు. ఇక త్రివర్ణ పతాకాన్ని సూచించేవిధంగా జెర్సీ కాలర్‌పై కాషాయం, తెలుగు, గ్రీన్ కలర్స్ తో కూడిన స్ట్రిప్స్ ఇచ్చారు. ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. కాషాయం రంగు కాస్త ఎక్కువైందంటూ కామెంట్లు వచ్చినా ఓవరాల్ గా జెర్సీ బాగుందంటున్నారు క్రికె ట్ అభిమానులు. ఇదిలా ఉంటే ఈ కొత్త జెర్సీ ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదల చేశారు. దీనిని అడిడాస్ అధికారిక స్టోర్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. అడిడాస్ ఆన్‌లైన్ స్టోర్‌లో టీమ్ ఇండియా కొత్త జెర్సీ ధర 5,999 రూపాయలు. త్వరలోనే వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లో అమెరికా, కెనడా జట్లు తలపడనున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీకోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.