top of page
MediaFx

బ్యాచ్‌ల వారీగా అమెరికాకు భారత క్రికెట్ బృందం..

ప్రతిష్ఠాత్మక 9వ టీ20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే టీమ్ ఇండియాను ప్రకటించారు. భారత ప్రధాన జట్టులో 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా.. నలుగురిని రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టు జూన్ 5 నుంచి తన పోరాటాన్ని ప్రారంభించనుంది. జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్జరుగుతున్నందున ఆటగాళ్లందరూ ఒకేసారి అమెరికా వెళ్లలేరు. అందుకోసం ఆటగాళ్లు రెండు బ్యాచ్‌లుగా టీ20 ప్రపంచకప్‌కు వెళ్లనున్నారు. తొలి బ్యాచ్‌లో ఈ ఆరుగురు ఆటగాళ్లు అమెరికా వెళ్లే అవకాశం ఉంది. పైన పేర్కొన్నట్లుగా, ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌లో భారత్‌తో పాటు అనేక దేశాల ఆటగాళ్లు ఆడుతున్నారు. తద్వారా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన జట్ల ఆటగాళ్లు ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌కు వెళతారు. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన జట్ల ఆటగాళ్లు తొలి బ్యాచ్‌లో అమెరికాకు పయనమవుతారు.ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు  ప్లే ఆఫ్ రేసు నుండి నిష్క్రమించాయి. కాబట్టి ఈ రెండు జట్ల నుంచి భారత్ టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలో అమెరికా వెళ్లనున్నారు. ఈ ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్‌కు చెందిన రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్, RCB నుంచి విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు.

bottom of page