రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తమ తొలి మ్యాచ్ కోసం సిద్ధమైంది. బుధవారం (జూన్ 05) ఐర్లాండ్‌తో మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభించనుంది. ఐర్లాండ్ జట్టును పాల్ స్టిర్లింగ్ నాయకత్వం వహిస్తున్నాడు. టీమ్ ఇండియాతో పోలిస్తే ఐర్లాండ్ అంత బలంగా లేదు కానీ, సంచలనాలు సృష్టించడంలో ఐర్లాండ్ దిట్ట. అందువల్ల టీమ్ ఇండియా ఐర్లాండ్‌ను తేలిగ్గా తీసుకోలేకపోతోంది. న్యూ యార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది, టాస్ రాత్రి 7:30 గంటలకు ఉంటుంది.
ఎక్కడ చూడొచ్చంటే: టీమ్ ఇండియా vs ఐర్లాండ్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో టీవీలో లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.
టీ20 ప్రపంచకప్ కోసం ఇరు జట్లు:
టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్)
హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్)
యశస్వి జైస్వాల్
విరాట్ కోహ్లీ
సూర్యకుమార్ యాదవ్
రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
సంజు శాంసన్ (వికెట్ కీపర్)
శివమ్ దూబే
రవీంద్ర జడేజా
అక్షర్ పటేల్
కుల్దీప్ యాదవ్
యుజ్వేంద్ర చాహల్
అర్ష్దీప్ సింగ్
జస్ప్రీత్ బుమ్రా
మహ్మద్ సిరాజ్
ఐర్లాండ్ జట్టు:
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్)
మార్క్ అడైర్
రాస్ అడైర్
ఆండ్రూ బల్బిర్నీ
కర్టిస్ కాంప్ఫెర్
గారెత్ డెలానీ
జార్జ్ డాకెరెల్
గ్రాహం హ్యూమ్
జాషువా లిటిల్
బారీ మెక్‌కార్తీ
నీల్ రాక్
హ్యారీ టెక్టర్
లోర్కాన్ బెన్ వైట్
క్రెయిగ్ యంగ్