top of page
Shiva YT

🐾 నాయిస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌..

🇮🇳 భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నాయిస్‌ భారత మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ థ్రిల్‌ రగ్గ్‌డ్‌ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు గోనాయిస్‌.కామ్‌లో అందుబాటులో ఉన్నాయి.

🌟 ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 2999కి లభిస్తోంది. ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 15 రోజుల బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే నాన్‌స్టాప్‌గా 15 రోజులు పనిచేస్తుంది.

🕒 ఇక నాయిస్‌ థ్రిల్‌ స్మార్ట్‌ వాచ్‌లో 2 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. తక్కువ ధరలో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందివ్వడం విశేషం.

🎮 ఈ స్మార్ట్ వాచ్‌లో 100కిపైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు. వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ కోసం ఐపీ68 రేటింగ్‌ను అందించారు. ఎవిరిడే స్టైల్‌కు అడ్వంచ‌ర్ ట‌చ్‌తో ఈ స్మార్ట్‌వాచ్ రూపొందించారు. క‌న్జూమ‌ర్స్ డైన‌మిక్ లైఫ్‌స్టైల్స్‌కు అనుగుణంగా ఫ్యాష‌న్ ఫార్వాడ్ అప్పీల్‌తో ఈ వాచ్‌ను డిజైన్‌ చేశారు.

🌈 నాయిస్‌ కలర్‌ఫిట్‌ థ్రిల్‌ వాచ్‌ జెట్ బ్లాక్‌, థండ‌ర్ గ్రే, క్యామో గ్రీన్‌, గ్రే, వింటేజ్ బ్రౌన్ వంటి ప‌లు క‌ల‌ర్స్‌లో అందుబాటులో ఉంది. ఇక హెల్త్‌ ఫీచర్ల విషయానికొస్తే.. హార్ట్ రేట్‌, ఎస్‌పీఓ2, స్లీప్ ప్యాట‌ర్న్స్‌, స్ట్రెస్ లెవెల్స్ వంటి ప‌లు హెల్త్ ఫీచ‌ర్లు, ట్రాకర్స్‌ను ఈ వాచ్ ఆఫ‌ర్ చేస్తోంది.

bottom of page