top of page
Shiva YT

🕹️గేమింగ్ లవర్స్ కోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

🕹️ శామ్సంగ్ గేలాక్సీ ఎస్24 ప్లస్ 5జీ.. మీకు అధిక నాణ్యత, పనితీరు కలిగిన గేమింగ్ ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలో క్యూహెచ్డీ ప్లస్ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. గేమింగ్ ఆడుతూ ఉంటే 29 గంటల లైఫ్ ఇస్తుంది. దీనిలో కెమెరా కూడా అధిక నాణ్యత కలిగిన 50ఎంపీ ఉంటుంది. బిల్ట్ ఇన్ జీపీఎస్, ఆల్ వేస్ ఆన్ డిస్ ప్లే ఉంటుంది. దీని ధర రూ. 1,09,999గా ఉంది.

🕹️ ఐకూ జెడ్7 ప్రో 5జీ.. ఇది శక్తివంతమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంటుంది. పెద్ద స్క్రీన్ సైజ్ 6.78 అంగుళాలు ఉంటుంది. 1300నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఎస్జీఎస్ బ్లూ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్ ఉంటుంది. దీనిలో 66వాట్ల ఫ్లాష్ చార్జర్ ఉంటుంది. దీని సాయంతో కేవలం 22 నిమిషాల్లో 50శాతం చార్జింగ్ సాధ్యమవుతుంది. దీని ధర అమెజాన్ వెబ్ సైట్లో రూ. 23,999గా ఉంటుంది.

🕹️ వన్ ప్లస్ 12 సిల్కీ బ్లాక్ గేమింగ్ ఫోన్.. గేమింగ్ లవర్స్ కోసం వన్ ప్లస్ తీసుకొచ్చిన టాప్ మోడల్ ఫోన్ ఇది. ఇంటెలిజెంట్ ఐ కేర్ టెక్నాలజీ, 2160హెర్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తో వస్తుంది. వీడియో ఎన్ హ్యాన్స్ మెంట్ కోసం హెచ్డీఆర్10ప్లస్, హెచ్డీఆర్ వివిడ్ డాల్బీ విజన్, డిస్ ప్లే మేట్ ఏప్లస్ వంటి ఫీచర్లు ఉంటాయి. గేమ్స్ ఆడితే బ్యాటరీ లైఫ్ 47 గంటలు ఉంటుంది. దీని ధర అమెజాన్ లో రూ. 69,999గా ఉంటుంది.

🕹️ ఒప్పో ఏ78 5జీ ఫోన్.. గేమింగ్ లవర్స్ కోసం యాపిల్, శామ్సంగ్ ఫోన్లకు దీటుగా ఒప్పో లాంచ్ చేసిన ఫోన్ . దీనిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల సూప్ వీఓఓసీ చార్జర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. కలర్ ఓఎస్ 13 ఆధారంగా పనిచేస్తుంది. అల్ట్రా లీనియర్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. దీనిని కేవలం రూ. 18,999కే అమెజాన్లో కొనుగోలు చేయొచ్చు.

🕹️ రియల్ మీ నార్జో 60 ప్రో.. దీనిలో 120 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ తో కూడిన కర్వ్ డ్ డిస్ ప్లే ఉంటుంది. 100ఎంపీ కెమెరా ఉంటుంది. 12జీబీ ర్యామ్, మరో 12 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. 128జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 5జీ చిప్ సెట్, 67 వాట్ల సూపర్ వీఓఓసీ చార్జర్ ఉంటుంది. దీని ధర అమెజాన్ ప్లాట్ ఫారంలో రూ. 23,999గా ఉంటుంది.

bottom of page