top of page

🔋📱 ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? ఫోన్‌ పేలిపోతుంది జాగ్రత్త.. 🔋📲

📱 స్మార్ట్ ఫోన్‌ ఉపయోగించే వారిలో చాలా వరకు ఛార్జింగ్‌ సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే ఛార్జింగ్ విషయంలో కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్‌ ఛార్జింగ్ విషయంలో కొన్ని తప్పులు చేస్తే ఫోన్‌ పేలిపోయే ప్రమాదం ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌ ఛార్జింగ్ విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు.? ఎలాంటి టిప్స్‌ పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓవర్‌ ఛార్జ్‌ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా గంటలతరబడి ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. దీంతో బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. రాత్రంతా ఛార్జింగ్ పెట్టి ఉండే అలవాటును మానుకోవాలి.

ఇక మనలో చాలా మంది రాత్రి పూట దిండు కింద ఫోన్‌ పెట్టి ఛార్జింగ్‌ పెడుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల బ్యాటరీ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. వీలైనంత వరకు గాలి తగిలే చోట మాత్రమే ఫోన్‌ ఛార్జింగ్ పెట్టాలి.

రాత్రంతా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉంటే. పవర్‌ డిస్‌ కంటిన్యూటీ అనే ఫీచర్‌ను ఉపయోగించాలి. ఈ ఫీచర్‌ సహాయంతో కొంత సమయానికి ఛార్జింగ్ ఆటోమెటిక్‌గా ఆఫ్‌ అయ్యేలా సెట్ చేసుకోచ్చు.

ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ వేడెక్కకుండా చూసుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ వేడిగా మారితే పేలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫోన్‌ వేడిగా కాకుండా చూసుకోవాలి.

ఇక మనలో చాలా మంది బ్యాటరీ ఉబ్బినా కూడా అలాగే ఉపయోగిస్తుంటారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఇలాంటి బ్యాటరీలు పేలుతాయని గుర్తుపెట్టుకోవాలి. 🔌📲

 
 
bottom of page