top of page
Shiva YT

ఈ ఫోన్ ధర ఏకంగా రూ. 6.68లక్షలు! 💰

ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ ఫోన్ల ఈ ప్రత్యేకమైన ఎడిషన్‌లు యాపిల్ విజన్ ప్రో హెడ్‌సెట్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ ఎలిమెంట్‌లను కలిగి ఉన్నాయి. వృత్తాకార వెంట్‌లు, వైబ్రెంట్ ఆరెంజ్ యాక్సెంట్‌లు పరికరం పైభాగాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. దిగువ భాగం విజన్ ప్రో ఫ్రంట్ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. యాపిల్ హెడ్‌సెట్ అభిమానులను దాని సూక్ష్మ సారూప్యతలతో ఆకర్షిస్తుంది. 🎧

ధర ఎంతంటే.. ఈ లగ్జరీ బ్రాండ్ కేవియర్ నుంచి ఊహించిన విధంగానే చాలా ఎక్కువ ధరతో ఈ ఫోన్లు వస్తాయి. యాపిల్ విజన్ ప్రో ఆధారంగా డిజైన్ చేసిన ఐఫోన్ 15 ప్రో ధర 8,060డాలర్లుగా ఉంది. (సుమారు రూ. 6,68,000) వద్ద ప్రారంభమవుతుంది.

శామ్సంగ్ బ్రాండ్ ఫోన్ కూడా.. కేవియర్ ఇక్కడితో ఆగలేదు. రానున్న కాలంలో మరిన్ని ఫోన్లను కస్టమైజ్ చేసి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది. ‘ఫ్యూచర్ కలెక్షన్’ ను కూడా పరిచం చేసింది. యాపిల్ ఐఫోన్‌లతో పాటు టెస్లా సైబర్‌ట్రక్-ప్రేరేపిత శామ్సంగ్ ఎస్24 అల్ట్రాను కూడా ఆవిష్కరించింది. అలాగే ఎమిర్ ఎడిషన్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ నుంచి డిజైన్ సూచనలను కలిగి ఉన్న మాగ్నమ్ ఐఫోన్15 ప్రో సిరీస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా, స్కైలైన్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఆర్కిటెక్ట్ ఆధారంగా ఉంటుంది.

యాపిల్ 15 ప్రో స్పెసిఫికేషన్లు ఇవి.. ప్రాథమిక ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ రెండూ ఒకే విధమైన స్పెక్స్‌ను కలిగి ఉన్నాయి. వీటిల్లో ప్రధాన వ్యత్యాసం స్క్రీన్ పరిమాణం. రెండు ఫోన్‌లు అద్భుతమైన సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్‌ప్లేతో పాటు ఆల్వేస్-ఆన్ మోడ్, సూపర్ స్మూత్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ప్రోమోషన్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ప్రో 6.1-అంగుళాల డిస్‌ప్లేను ఉపయోగించుకుంటుంది. అయితే ప్రో మాక్స్ పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్‌ని కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. 48ఎంపీ ప్రధాన సెన్సార్ తో పాటు 12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 📱

bottom of page