top of page
Shiva YT

వాట్సాప్‌లో మరో సూపర్‌ ఫీచర్‌..

వాట్సాప్‌.. ఈ మెసేజింగ్ యాప్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. దీంట్లో ఉన్న ఫీచర్లే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతకటి క్రేజ్‌ ఉంది. మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్‌ అందుబాటులో ఉన్న వాట్సాప్‌ క్రేజ్‌ తగ్గకపోవడానికి ఇదే కారణమని చెప్పొచ్చు.

యూజర్ల సెక్యూరిటీ, ప్రైవసీకి పెద్దపీట వేస్తూ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్‌లో పిన్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌తో సహాయంతో ఇంపార్టెంట్ చాట్‌ అన్నింటికన్నా పైన కనపించేలా పిన్‌ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. అయితే ఈ పిన్‌ ఆప్షన్‌ ప్రస్తుతం కేవలం ఒక్క చాట్‌కు మాత్రమే అందుబాటులో ఉండగా వాట్సాప్‌ ఇప్పుడు ఈ సంఖ్యను పెంచుతోంది.

ఇకపై యూజర్లు ఒకే సమయంలో మూడు కన్నా ఎక్కువ ఛాట్స్‌, మెసేజ్‌లను పిన్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం 2.24.6.15 లేదా అంతకన్నా తర్వాతి వాట్సప్‌ వర్షన్లు ఉపయోగిస్తున్న వారికి ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే త్వరలోనే మిగతా యూజర్లకు కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. తాజా వాట్సప్‌ బీటా వర్షన్‌ అందుబాటులో గలవారు ఈ ఫీచర్‌ ద్వారా ఒక్కో ఛాట్‌కు మూడు వరకూ మెసేజ్‌ల చొప్పున.. ఐదు ఛాట్స్‌ను పిన్‌ చేసుకోవచ్చు.

అయితే ఈ కొత్త ఫీచర్‌ను ఇంకా అధికారంగా ప్రకటించలేదు. ఇక వాట్సాప్‌లో మెసేజ్‌ను పిన్‌ చేసుకోవాలంటే ఇందుకోసం ముందుగా ఛాట్‌ను ఓపెన్‌ చేయాలి. అనంతరం ఛాట్‌ పైభాగాన కనిపించే పిన్‌ గుర్తు మీద క్లిక్‌ చేస్తే 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు అనే ఆప్షన్స్‌ కనిపిస్తాయి. మీకు నచ్చిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిన్‌ చేసిన మెసేజ్‌ను అన్‌పిన్‌ చేయాలనుకుంటే క్లిక్‌ చేసి అన్‌పిన్‌ చేసుకుంటే చాలు.

bottom of page