top of page
MediaFx

5జీ ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.?

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ ఇటీవల రియల్‌మి 12 ఎక్స్‌ పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రియల్‌మి 12 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌ లాంచింగ్‌ సమయంలో రూ. 16,999గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఈ ఫోన్‌పై 29 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 11,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా మరింత డిస్కౌంట్‌ పొందొచ్చు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. అలాగే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్‌ను ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 45డబ్ల్యూ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000ఎంఎహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ చెబతోంది.

ఇక ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఎయిర్‌ గెస్చర్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో ఫోన్‌ను టచ్‌ చేయకుండానే కాస్త దూరం నుంచి ఆపరేట్‌ చేసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే రియల్‌మి 12 ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే ఇందులో తక్కువ లైట్‌లో ఫోటోలు తీసుకోవడానికి వీలుగా.. సూపర్ నైట్‌స్కేప్ మోడ్‌ను ఇచ్చారు. ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

bottom of page