ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం పోకో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. పోకో ఎఫ్6 స్మార్ట్ ఫోన్ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి.
1220 పిక్సెల్స్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది.
ఇక కెమెరా విషయానికొస్తే పోకో ఎఫ్6లో సోనీ IMX882 సెన్సర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్టు సమాచారం.
పోకో ఎఫ్6 స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 25 లోపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో టాప్ ఎండ్ మోడల్ వెర్షన్ ధర రూ. 30 వేలలోపు ఉండొచ్చని చెబుతున్నారు.
కాగా పోకో ఎఫ్6 మోడల్‌కి కొనసాగింపుగా పోకో ఎఫ్6 ప్రో మోడల్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పోకో ఎఫ్5కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.