ఇప్పుడంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. అందరూ 5జీ సపోర్టుతో కూడిన స్మార్ట్ ఫోన్లు కావాలనుకుంటున్నారు. అయితే వాటి ధరలు కాస్త మధ్యస్తంగా ఉంటున్నాయి. అయితే తక్కువ ధరలోకూడా 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో రియల్‌మీ 12ఎక్స్ 5జీ, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ముందువరుసలో ఉన్నాయి.
ఈ రెండు ఫోన్లు ఆయా కంపెనీల నుంచి వచ్చిన లేటెస్ట్ మోడల్స్. వాటిలోని ప్రత్యేకతలను ఒకసారి చూస్తే రియల్‌మీ 12ఎక్స్ 5జీ అనేది 45వాట్ల చార్జింగ్ సపోర్టు అందిస్తుంది. 120హెర్జ్ డిస్ ప్లే, 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీతో వస్తుంది. డైమెన్సిటీ చిప్‌సెట్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్, 50ఎంపీ ఏఐ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 11,999 నుండి ప్రారంభమవుతుంది. ట్విలైట్ పర్పుల్, వుడ్‌ల్యాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ వివరాలు చూస్తే దీని ధర రూ. 12,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్ ప్లే, డైమెన్సిటీ చిప్‌సెట్, 50ఎంపీ కెమెరా, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఇది యాష్ బ్లాక్, జాజీ గ్రీన్, గ్రూవీ వైలెట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, రెండింటి మధ్య తేడాలు ఇక్కడ ఇస్తున్నాం. ఓసారి చదివేయండి..
డిస్ ప్లే.. రియల్ మీ 12ఎక్స్ 5జీలో 6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ (1080×2400), 120హెర్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ ఉంటుంది. అదే సమయంలో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీలో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (1080×2340), 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
ప్రాసెసర్.. రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5జీ ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్.. రెండు ఫోన్లలోనూ 4జీబీ, 6జీబీ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.
స్టోరేజ్.. రియల్ మీ 12ఎక్స్ 5జీలో 128జీబీ, మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించే అవకాశం ఉంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీలో 128GB, మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించే అవకాశం ఉంటుంది.
బ్యాక్ కెమెరా యూనిట్.. రియల్ మీ 12ఎక్స్ 5జీలో 50ఎంపీ మెయిన్, 2ఎంపీ సెకండరీ ఉంటుంది. అదే సమయంలో శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీలో 50ఎంపీ మెయిన్, 5ఎంపీ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2ఎంపీ మాక్రో యూనిట్ తోకూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది.
ఫ్రంట్ కెమెరా.. రియల్ మీ 12ఎక్స్ 5జీలో 8ఎంపీ, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీలో 13ఎంపీ ఉంటుంది.
బ్యాటరీ.. రియల్ మీ 12ఎక్స్ 5జీలో 5000ఎంఏహెచ్ 45వాట్ల సూపర్ వీఓఓసీ ఛార్జింగ్ సపోర్టు ఉంటుంది. అలాగే శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీలో 6000ఎంఏహెచ్ 25వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఉంటుంది.
ఆపరేటింగ్ సిస్టమ్.. రియల్ మీ 12ఎక్స్ 5జీలో రియల్‌మీ యూఐతో కూడిన ఆండ్రాయిడ్ 14, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీలో వన్ యూఐ6తో కూడిన ఆండ్రాయిడ్ 14 ఉంటుంది.
ధరలు.. రియల్ మీ 12ఎక్స్ 5జీ 4జీబీ+128జీబీ: రూ. 11,999, 6జీబీ+128జీబీ: రూ. 13,499.. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ 4జీబీ+128జీబీ: రూ. 12,999, 6జీబీ+128జీబీ: రూ. 14,499
అదనపు ఫీచర్లు.. రియల్ మీ 12ఎక్స్ 5జీలో ఆవిరి చాంబర్ కూలింగ్ సిస్టమ్, 5జీ తక్కువ పవర్, స్మార్ట్ హాట్‌స్పాట్ ఉంటుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీలో 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను వాగ్దానం చేస్తుంది.