ఎక్కువ మంది ఎంచుకుంటున్న పాస్‌వర్డ్‌లలో దేశం పేరును కూడా ఉపయోగిస్తున్నారు. కేవలం భారత్‌మాత్రమే కాకుండా ఇతర దేశౄల్లో కూడా దేశం పేరుతో కూడిన పస్‌వర్డ్‌లను సెలక్ట్ చేసుకుంటున్నారు.
భారతీయులు ఎక్కువగా ‘ఇండియా@123’ అనే పాస్‌వర్డ్‌ను ఎంచుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది అత్యంత సాధారణంగా ఎక్కువ మంది ఉపయోగించిన పాస్‌వర్డ్‌లలో ‘అడ్మిన్’ కూడా ఒకటి. ఇక వీటితో పాటు.. భారత్‌లో ఈ ఏడాది ఎక్కువ మంది ఉపయోగించిన పాస్‌వర్డ్‌స్‌లో.. ‘Password’, ‘Pass@123’, ‘password@123’లను ఉపయోగిస్తున్నట్లు తేలింది.
ఇక ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్స్‌లో సుమారు 31 శాతం మంది ‘123456789’, ‘000000’తో పాటు పలు సీరియల్ నెంబర్లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. ‘పాస్‌కీ’ అనే టెక్నాలజీ ద్వారా పాస్‌వర్డ్‌లకు సెక్యూరిటీ ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఈ టెక్నాలజీ వీక్ పాస్‌వర్డ్స్‌ను తొలగించడంలో సహాయపడడంతో పాటు, సెక్యూరిటీని పెంచుతుంది. అయితే ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని టోమస్ స్మలాకీస్ చెప్పుకొచ్చారు. 🌐🔒🛡️