వన్ ప్లస్ నోర్డ్ సీఈ2 5జీ.. దీనిలో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో ఉంటుంది. దీని ధర రూ. 24,999గా ఉంది. దీనిలో 65వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 900 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 90హెర్జ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఏఐ ఆధారిత ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్ 11తో రన్ అవుతోంది. 📸🚀
ఐకూ జెడ్7 ప్రో 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 23,999గా ఉంది. ఇది 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. డైమెన్సిటీ 7200 5జీ ప్రాసెసర్, స్లిమ్ 6.78-అంగుళాల అద్భుతమైన 120హెర్జ్ అమెల్డ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. దీనిలో 64ఎంపీ ఆరా లైట్ ఓఐఎస్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే 4600ఎంఏహెచ్ బ్యాటరీ 66వాట్ల ఫ్లాష్‌ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. 🔥🔋
ఇన్ఫినిక్స్ జీరో 30 5జీ.. దీనిలో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 23,999గా ఉంది. దీనిలో ఫుల్ హెచ్ డీప్లస్ డిస్ ప్లే, డైమెన్సిటీ 8020 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 108ఎంపీ, 13ఎంపీ, 2ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది. 📸📱
రియల్ మీ నార్జో 60 ప్రో.. ఇది 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. దీని ధర రూ. 23,999గా ఉంది. 120 డిగ్రీల కర్వ్డ్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. 100ఎంపీ కెమెరాను కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్ కు బాగా ఉపయోగపడుతుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో ఆధారంగా పనిచేస్తుంది. బ్యాటరీ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 📷🚀
శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ.. ఈ స్మార్ట్ రూ. 21,999కే లభిస్తుంది. దీనిలో ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రధాన కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ను కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక పనితీరు కోసం, ఇది నాలుగు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, ఐదు సంవత్సరాల భద్రతా నవీకరణల ద్వారా మద్దతు పొందుతోంది. ఇది శామ్సంగ్ ఎక్సినోస్ 1280 ఆక్టా కోర్ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది.