ఇన్‌ఫినిక్స్ జీరో 30 5జీ: ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 23,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు, 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను అందించారు. 📱👀📸
మోటోరోలా ఎడ్జ్ 40: మోటోరోలో ఎడ్జ్ 40 స్మార్ట్ ఫోన్ ధర రూ 24,999గా ఉంది. ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ ఈ ఫోన్ సొంతం. ఇక ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. 📱👀📸
పోకో ఎఫ్5 5జీ: పోకో బ్రాండ్‌కు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 22,999గా ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 7+ జెన్2తో పనిచేసే ఈ ఫోన్‌లో 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్‌ను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇక ఇందులో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 16 మెంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 📱👀📸
రియల్ మీ 10ప్రో+: రియల్‌మీ 10ప్రో+ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 24,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్‌ను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు, అలాగే 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 📱👀📸