iPhone SE 4 కి సంబంధించి కొంత సమాచారం లీక్ అయింది. iPhone SE 4 2024 జనవరి నుంచి మార్చి మధ్యలో విడుదల కావచ్చననే వార్తలు వినిపిస్తున్నాయి.
నిజానికి, iPhone SE 3 ఫీచర్లు, డిజైన్‌లు ప్రజలు ఊహించినంత ప్రజాదరణ పొందలేదు. అయితే, కొత్త మోడల్‌లో డిజైన్ మరియు కొన్ని విషయాలు మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఐఫోన్ ధర రూ.50 వేల లోపే ఉండవచ్చని అంచనా.
iPhone SE 4 ఫీచర్లు: iPhone SE 4 డిజైన్ iPhone 14 మాదిరిగానే ఉంటుందని ఈ లీక్‌లు సూచిస్తున్నాయి. దీనర్థం దిగువన బటన్‌లు ఉండవు. స్క్రీన్ చుట్టూ విశాలమైన బ్లాక్ బార్‌లు కూడా ఉండవు. స్క్రీన్, బదులుగా ఫుల్ బాడీతో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఐఫోన్ SE 4 రూపకల్పన మరింత ఆధునికంగా, మరింత స్మార్ట్‌గా ఉంటుందని చెప్పారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ ఐన్‌ఫోన్ iPhone SE 4 మార్కెట్లోకి వస్తుందోనని ఐఫోన్ ప్రియులు అతృతగ ఎదురు చూస్తున్నారు. 🤔📱🎉