top of page
Shiva YT

టాప్‌ ఫీచర్స్‌తో ఆసస్‌ నుంచి నయా ల్యాప్‌టాప్‌. 💻

ఆసస్‌ క్రోమ్‌ బుక్‌ప్లస్‌ సీఎక్స్‌ 3402 ల్యాప్‌టాప్‌ ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి రూపొందించారు. ఈ ల్యాప్‌టాప్‌ 14 అంగుళాల స్క్రీన్‌తో 12వ జెనరేషన్‌ ఇంటెల్‌ ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

16 జీబీ + 512 జీబీ వేరియంట్‌లో లభించే ఈ ల్యాప్‌టాప్‌ పనితీరు విషయంలో కీలకంగా ఉంటుంది. సుధీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌, సూపర్‌ స్టైల్‌ష్‌ డిజైన్‌ ఈ ల్యాప్‌టాప్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి. ఈ ల్యాప్‌టాస్‌ ఆసన్‌ నుంచి వచ్చిన మొదటి క్రోమ్‌బుక్‌ అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

కేవలం 1.4 కేజీల సొగసైన డిజైన్‌తో ఈ ల్యాప్‌టాప్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. 180 డిగ్రీల కోణంతో, యాంటీమైక్రోబయల్‌ కోటింగ్‌, స్పిల్‌ రెసిస్టెంట్‌ బ్లాక్‌లీట్‌ కీబోర్డ్‌, ఎంఐఎల్‌-ఎస్‌టీడీ 810 హెచ్‌ మిలటరీ గ్రేడ్‌ డ్యూరబులిటీతో పని చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ ఐ7 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ముఖ్యంగా ఈ ల్యాప్‌ 45 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో యూఎస్‌బీ టైప్‌-సీ చార్జింగ్‌ పోర్ట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫీచర్లతో విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులకు కూడా అనువుగా ఉంటుంది. 💼🔋

bottom of page