ఈ స్మార్ట్‌ఫోన్లో 144హెర్జ్ అధిక రిఫ్రెష్ రేట్‌తో గణనీయమైన పిక్చర్ క్వాలిటీని అందించే 6.7-అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది.
ఈ స్క్రీన్ 2160హెర్జ్ వద్ద అధునాతన పీడబ్ల్యూఎం డిమ్మింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. గరిష్ట బ్రైట్ నెస్1400 నిట్‌ల వరకు చేరుకోగలదు. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ అందించారు.
కెమెరా సెటప్.. రియల్‌మీ జీటీ5 ఫోన్లో ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్890 ప్రధాన కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీమాక్రో కెమెరాతో ఉంటుంది. ముందు వైపు, అద్భుతమైన సెల్ఫీలను తీయడానికి రూపొందించబడిన 16ఎంపీ వైడ్ కెమెరా ఉంది.
బ్యాటరీ సామర్థ్యం.. రియల్‌మీ జీటీ5 స్మార్ట్ ఫోన్లో 4600ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. దీనిలో ఏకంగా 240వాట్ల సామర్థ్యంతో కూడిన ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. దీంతో బ్యాటరీని కేవలం 9 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. దీనిలో 5240ఎంఏహెచ్ బ్యాటరీతో మరొక వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 150వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
రియల్‌మీ జీటీ5 ధర.. మన భారతీయ మార్కెట్లో రియల్‌మీ జీటీ5 12జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 35,000, 16జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 37,000, 240W ఛార్జింగ్‌తో కూడిన హై-ఎండ్ 24జీబీ ర్యామ్ వేరియంట్ ధర దాదాపు రూ. 43,000 ఉంటుంది. 💰📸🔋