🇨🇳 చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 14న హానర్ 90 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. 📆
📸 కెమెరాకు అత్యంత ప్రాధానత్య ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. 📷 అలాగే సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 🤳
📡 హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన కర్వ్డ్ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. 1200×2664 పిక్సెల్స్ ఈ డిస్‌ప్లే సొంతం. 📺
📲 ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్‌సెట్‌ను అందించారు. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 💽 బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 66 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ అందిచారు. 🔋
💰 ధర విషయానికొస్తే చైనాలో విడుదల చేసిన సమయంలో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29 వేలు, 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 32,680, 16 జీబీ ర్యామ్, 512 స్టోరేజ్ ధర రూ. 35,017గా ఉంది. మరి భారత్‌లో ధరల విషయంలో ఏవైనా మార్పులు ఉంటాయో చూడాలి. 💸🇮🇳