మీరు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్‌లో ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేయకపోతే, అది ఇబ్బందులను కలిగిస్తుంది.
మీరు ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచకపోతే విమానం కూలిపోతుందని దీని అర్థం కాదు. కానీ, విమానాలను నడిపే పైలట్లకు ఇది ఇబ్బందులను కలిగిస్తుందట. విమానంలో మొబైల్ కనెక్షన్‌ని ఉంచడం విమానం కమ్యూనికేషన్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.ఫ్లైట్ సమయంలో పైలట్లు ఎల్లప్పుడూ రాడార్, కంట్రోల్ రూమ్‌తో టచ్‌లో ఉంటారు. అయితే, ఈ సందర్భంలో ఫోన్ ఆన్‌లో ఉంటే, పైలట్‌లకు సూచనలను స్పష్టంగా పొందలేరు. అటువంటి పరిస్థితిలో ఫ్లైట్ సమయంలో మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్విచ్ ఆన్ చేసి ఉంటే అది పైలట్ అందుకున్న రేడియో ఫ్రీక్వెన్సీకి అంతరాయం కలిగిస్తుంది. అందుకే మీరు విమానంలో ప్రయాణించేటప్పుడు మీ ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచండి.