top of page
Suresh D

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ ‘హనుమాన్’🎥🌟

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా న‌టిస్తున్నాడు.

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth Varma) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’ (Hanuman). భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు తేజ సజ్జా (Teja Sajja) హీరోగా న‌టిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక సూపర్ హీరో సిరీస్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌లు హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఈ మూవీ నుంచి సెన్సార్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

హ‌నుమాన్ చిత్రం తాజాగా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ (U/A) స‌ర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా నిడివి 2 గంట‌ల 30 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ఈ సినిమా చూడ‌టానికి 1.5 ల‌క్ష‌ల‌కు పైగా అభిమానులు ఆస‌క్తిక‌రంగా ఉన్న‌ట్లు బుక్ మై షోలో వెల్ల‌డించారు.

ఇక ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అస్రిన్‌ రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా, వెంకట్‌ కుమార్‌ జెట్టీ లైన్‌ ప్రొడ్యూసర్‌గా, కుశాల్‌ రెడ్డి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హనుమాన్‌ చిత్రానికి గౌరహరి-అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తున్నారు.🎥🌟

bottom of page